వచ్చే ఎన్నికల్లో రైతు ప్రభుత్వం :కేసీఆర్‌

41
kcr
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీని పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. పెద్దపల్లి జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌ భవనంను ప్రారంభించిన ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో పాల్గోన్ని మాట్లాడారు. దేశంలో జరుగుతున్న అవినీతి, రైతు వ్యతిరేకంగా ఈ ప్రభత్వం చేస్తున్న పనుల వల్ల దేశం చాలా వెనుకబడిపోయిందన్నారు. దేశంలో రైతులు సాగుకు వాడే విద్యుత్‌్ కేవలం 20.8 శాతమే దీనికి అయ్యే ఖర్చు రూ1.45లక్షల కోట్లు మాత్రమే ఇది కార్పొరేట్‌ దొంగలకు దోచిపెట్టినంత సొమ్ము కూడా కాదు మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్‌ పెట్టాలి జాతీయ రాజకీయాల్లోని రావాలని రైతు సంఘాల నేతలు కోరుకుంటున్నారు. మీటరర్లు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఎన్‌పీఏల కింద రూ12లక్షల కోట్లు దోచిపెట్టారు.

రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడంలేదు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలి. బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం అందరూ సన్నద్దం కావాలి అని కేసీఆర్‌ చెప్పారు. కేంద్రానికి ముందుచూపులేక పరిపాలన చేతకాక పిచ్చివిధానాలతో అట్టర్‌ ప్లాఫ్‌ చేసి దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చి రూపాయి విలువ పతనం చేసి అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్ఠ దిగజార్చిన ఈ ప్రభుత్వం ఏం చేస్తోందో చూస్తున్నాం మోసపోతే గోసపడతాం ఒక్కసారి దెబ్బతింటే వెనక్కిపోతాం కూల్చడం తేలిక కట్టడం చాలా కష్టమన్నారు. రైతులకు మీటర్లు పెట్టాలని వెంటపడే బీజేపీ నరేంద్రమోదీకి మనమందరం కలిసి మీటర్‌ పెట్టాలి అని కేసీఆర్‌ మండిపడ్డారు.

- Advertisement -