నెక్ట్స్‌ సీఎం కేసీఆరే..: పీజేపీ మంత్రి

197

కేంద్ర మంత్రి , రిపబ్లిక్‌పార్టీ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీవార్తే హాట్‌ టాపిక్‌గా మారింది. కామారెడ్డిలో ఈ రోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపని సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం అవడం ఖాయమని వెల్లడించారు.

 ramdas thalwale

కామారెడ్డిలో ఈరోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో పేదలకు, రైతులకు, దళితులకు, మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో పాటుపడుతున్నారని ప్రశంసించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ చెబుతున్న తరుణంలో రాందాస్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం చర్చనీయాంశంగా మారింది.