న్యూజిలాండ్‌ ప్రధానికి కరోనా

23
pm

ప్రపంచవ్యాప్తంగా కరోనా తిరిగి కోరలు చాస్తోంది.. ఇప్పటికే చైనాలో కరోనా దాటికి లాక్ డౌన్, కఠిన ఆంక్షలు అమలవుతుండగా తాజాగా న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా అర్డెర్న్‌ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆమెకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

వచ్చే శనివారం వరకు ప్రధాని ఐసోలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. జసిండా భాగస్వామి క్లార్క్‌ గేఫోర్డ్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా వైరస్‌ తొలి కేసు నమోదైన తర్వాత అత్యంత కఠినంగా ఆంక్షలను అమలుచేసిన దేశాల్లో న్యూజిలాండ్‌ ఒకటి. గత వారం న్యూజిలాండ్‌లో కరోనా నుండి 50 వేల మంది బయటపడ్డారు.