తొలి టెస్ట్ లో భారత్ పై న్యూజిలాండ్ గెలుపు

214
ind vs newzeland

భారత్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 144/4 తో నాలుగోరోజు బ్యాటింగ్ ని ప్రారంభిచిన భారత్ కేవలం 191 పరుగులకే ఆలౌటైంది. దీనితో కివీస్ జట్టుకు 9 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కివీస్ జట్టు వికెట్‌ నష్టపోకుండా 1.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి ఇంకా ఒక్కరోజు అట ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేసింది.రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 168 పరుగులకే అలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం 2పరుగలకే అవుట్ అయ్యారు. రహానే 46 పరుగులు చేయగా మయాంక్ అగర్వాల్ 34 పరుగులు చేశాడు. దీంతో 165 పరుగులకే ఇండియా ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 89 పరుగులు చేయగా రాస్ టేలర్ 44పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ మూడు, షమీ, బుమ్రా చెరొక వికెట్ పడగొట్టారు.