న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ దూకుడుగా ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. టీం ఇండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (87 ; 96 బంతుల్లో 9X4, 3X6), శిఖర్ ధావన్ ( 66; 67 బంతుల్లో 9X4, 0X6) ఇద్దరు అర్ధ సెంచరీలు చేసి భారత్ భారీ స్కోర్ దిశగా సాగేందుకు బాటలు వేశారు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, ఇది 14వ సారి కావడం విశేషం . భారత్ బ్యాట్స్‌మెన్స్‌లో విరాట్ కోహ్లీ ( 43 ; 45 బంతుల్లో 5X4, 0X6), రాయుడు (49 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్), ధోని (33 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కేదార్ జాదవ్ (10 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్స్, 1 సిక్స్) చేశారు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.