వెల్లింగ్టన్ టీ20..టీమిండియా ఓటమి

242
ind vs nz
- Advertisement -

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత మహిళల జట్టుకు పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ విధించిన 160 పరుగుల లక్ష్యఛేదనలో 136 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ప్రియా పునియా 4 పరుగులకే వెనుదిరిగినా స్మృతి మందనా,రోడ్రిగ్స్‌ జట్టును ఆదుకున్నారు. స్మృతి మందనా హాఫ్ సెంచరీతో 58 పరుగులు చేయగా రోడ్రిగ్స్‌ 39 పరుగులు చేసింది.

రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. ఓ దశలో భారత్‌ విజయం ముంగిట నిలవగా వీరిద్దరు పెవిలియన్ బాటపట్టగానే మిగితా ఆటగాళ్లు స్రోరు బోర్డును పరుగులు పెట్టించడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ 19.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది.

అంతకముందు టాస్‌ గెలిచిన భారత్‌..న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.సోఫీ డివైన్‌(62) హాఫ్ సెంచరీతో రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 159 పరుగులు చేసింది. అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, దీప్తీ శర్మ, పూనమ్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ జట్టు 1-0తో ఆధిక్యంలోకి నిలిచింది.

- Advertisement -