భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. టీ20 జట్టును ప్రకటించిన కివీస్ దాదాపు 19నెలల తర్వాత రాస్ టేలర్‌ను జట్టులోకి తీసుకుంది.
గాయం కారణంగా లెగ్ స్పిన్నర్ టాడ్ అస్లే స్థానంలో రాస్ టేలర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు కివీస్ కోచ్ మైక్ హెసన్ వెల్లడించారు. టీ20 ర్యాంకింగ్స్‌లో మా జట్టు అగ్రస్థానంలో ఉంది. ఈ విభాగంలో భారత్‌పై మాకు మెరుగైన రికార్డు ఉంది. భారత్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం కష్టమే. అయినప్పటికీ ఈ సిరీస్‌లో విజయం కోసం ఎంతైనా కష్టపడతాం.’ అని ఆయన చెప్పారు.
2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిన తర్వాత టేలర్ టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
టీ20 సిరిస్… న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మిచెల్ సాంత్నార్, గ్రాండ్ హోమ్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రీ, గ్లెన్ ఫిలిప్స్,ఇష్ సోథీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్, ట్రెంట్ బౌల్ట్, టామ్ బ్రూస్