న్యూ జీలాండ్‌లో పివీ శత జయంతి ఉత్సవాలు..

191
New Zealand NRI's
- Advertisement -

న్యూ జీలాండ్‌లో పివీ శత జయంతి ఉత్సవాలు. ఈ రోజు పి.వీ. నరసింహ రావు శత జయంతి సందర్భంగా భారత మాజీ ప్రధానికి ప్రవాస భారతీయ తెలంగాణ, తెలుగు బిడ్డలు స్మరించుకొని ఘన నివాళులు అర్పించారు. కరోనా దృష్ట్యా  ప్రవాసులు తమ తమ స్వగృహాలలో పి.వీ. నరసింహ రావును స్మరించుకొని నివాళులు అర్పించారు. ముందుగా బాల బీరం కెల్స్టోన్ ఎంపీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా పీవీ సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి కొసన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సిఎం కెసిఆర్ తలపెట్టిన ఈ శత జయంతి ఉత్సవాలు తరువాతి తరాలు గుర్తుంచుకునే విధంగా జరుపుతున్నదుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యూ జీలాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ విద్యార్థులు సదస్సు లో భాగంగా అధ్యక్షురాలు శ్రీలత మాగతాల, పూర్వపు అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, పీవీ సేవలను కొనియాడారు.

ఆలాగే ఈ సదస్సులో పాల్గొన్న విజయభాస్కర్ రెడ్డి కొసన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీర్, పీవీ శత జయంతి ఉత్సవ సభ్యుడు మహేష్ బిగాలా వేడుక కోసం సూచనలు ఇచ్చిన పిమ్మట త్వరలోనే న్యూ జీలాండ్‌లో పీవీ జన్మదిన వేడుక జరుపుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంఘం ఉపాధ్యక్షులు కృష్ణ రెడ్డి ఆరెపల్లి, జనరల్ సెక్రటరీ  భవాని శంకర్ , ఇతర కమిటీ  సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -