కరోనా ఫ్రీ కంట్రీగా న్యూజిలాండ్..

213
newzealand pm
- Advertisement -

కరోనా మహమ్మారి దాటికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు కరోనా విస్తరించగా ఇప్పటికి పలుదేశాలు లాక్‌ డౌన్ అమలు చేస్తున్న పరిస్ధితి నెలకొంది.

అయితే కరోనాపై పోరులో విజయం సాధించిన దేశంగా నిలిచింది న్యూజిలాండ్. ఈ విషయాన్ని ఆదేశ ప్రధాని జసిండా అర్డెర్న్ తెలిపారు. దేశంలో నమోదైన చిట్టచివరి కరోనా వైరస్‌ బాధిత మహిళ కోలుకుందని తెలిపారు.

ఈ వార్త విన్న తర్వాత తన కూతురితో కలిసి డ్యాన్స్ చేశానని తెలిపిన జసిండా…దేశంలో కరోనా ఆంక్షలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. కరోనాను తరిమికొట్టినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు.

గత 17 రోజుల నుంచి అక్కడ కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. న్యూజిలాండ్‌లో 1500 మంది కరోనా బారిన పడగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాను జయించిన న్యూజిలాండ్‌ను పలు దేశాలు ప్రశంసిస్తున్నాయి.

- Advertisement -