నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం ఏరులై పారింది. మందుబాబులు ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండించారు.తెలంగాణలో ఒక్కరోజే రూ.520 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30న రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. వారం రోజుల్లో సుమారు రూ.1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
డిసెంబర్ నెల మొత్తం సుమారు రూ. 3,800కోట్ల పైచిలుకు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 30, 31 తేదీల్లో వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 30వ తేదీన రూ.402 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 31వ తేదీన (మంగళవారం) రాత్రి 10గంటల వరకు అందిన లెక్కల ప్రకారం సుమారు రూ. 520 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.
డిసెంబర్ నెలలో మొత్తంలో 38లక్షల కేసుల లిక్కర్ సేల్స్ అయితే, 45లక్షల బీర్ కేసుల సేల్స్ అయినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి.
Also Read:ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..