మిల్కీ బ్యూటీతో న్యూ ఇయ‌ర్ బ్లాస్ట్‌

240
New Year Bash 2018 With Tamanna
- Advertisement -

న్యూఇయర్ వేడుకలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ముమ్మర ఏర్పాట్లలో ఉన్నారు నిర్వాహకులు. పాత సంవత్సరానికి బైబై చెబుతు న్యూఇయర్‌కు ఘనంగా వెల్‌కమ్ చెప్పేందుకు అంతా సిద్దమవుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రోజున టాలీవుడ్‌ తారల డ్యాన్స్‌ షోలు ప్రత్యేక ఆకర్షణ నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థ‌లు దీనిని క్యాష్ చేసుకొని స్పెష‌ల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాయి.

ఏపీలోని అమరావతిలో జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో మిల్కీ  బ్యూటీ తమన్నా  సందడి చేయనుంది. గుంటూర్ సమీపంలోని హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో నిర్వహించే భారీ వేడుకల్లో డ్యాన్స్ చేయడానికి అమ్మడు ఒప్పందం చేసుకుందట.   తమ్ము కోసం భారీ రేటు చెల్లించి మరీ నిర్వాహకులు విజయవాడకు రప్పిస్తున్నారు.తమన్నాతో పాటుగా మెహ్రీన్, కైరా దత్ తదితర అందాల భామలు కూడా ఆ రోజు అక్కడ డ్యాన్సులు చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి బుల్లితెర యాంకర్ రవి, మేఘనలతో పాటు.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా హాజరుకానుండటంతో హాయ్‌లాండ్‌ సినీజోష్‌తో నిండిపోనుంది.ఎప్పుడు అమెరికాలో సంద‌డి చేసే త‌మ‌న్నా ఈ సారి న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కి విజ‌య‌వాడ రానుండ‌డం విశేషం.

New Year Bash 2018 With Tamanna

- Advertisement -