హగ్‌ ఇస్తానంటున్న పూరి

315
Puris first short -Hug
- Advertisement -

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సరికొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు.  తన గురువు రాంగోపాల్ వర్మ దారిలోనే షార్ట్‌ ఫిల్మ్స్‌ బాటపట్టారు. వెండితెర మీద కంటిన్యూ అవుతూనే, యుట్యూబ్ వెబ్ సిరీస్‌తో సంచలనం సృష్టించేందుకు డిసెంబర్ 31న ముందుకు రానున్నాడు.

తాను తీయబోయే షార్ట్ ఫిల్మ్‌ ‘హగ్’ అని ప్రకటించిన పూరి 31న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  ఇప్పుడు ‘హగ్’ పోస్టర్  చర్చనీయంగా మారింది. ఎందుకంటే.. ఆ ఫొటోలో చెట్టును కౌగిలించుకున్న ఉన్న అమ్మాయి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా ఉంది. ఆమె వెనుక భాగమంతా కనిపిస్తోంది.

పచ్చని ప్రకృతి ఒడిలో ఓ అమ్మాయి చెట్టును ఆప్యాయంగా కౌగిలించుకోవడాన్ని చూస్తుంటే.. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసేలా దీన్ని రూపొందించి ఉంటారని తెలుస్తోంది.

https://twitter.com/purijagan/status/944168295720108032

- Advertisement -