ఈఎస్ఐ స్కామ్.. దర్యాప్తులో కీలక అంశాలు..

421
esi scam
- Advertisement -

ఈఎస్ఐ స్కామ్‌లో మరొక కీలక అధికారిని ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈఎస్‌ఐ డైరెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సురేంద్ర నాథ్‌ను ఆర్సీపురంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కస్టడీలో సురేంద్ర నాథ్ విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక అంశాలు ఏసీబీ వెల్లడించింది.

గడిచిన నాలుగేళ్ళ లో 1000 కోట్లు మందుల కొనుగోళ్లు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అంతే కాదు సంవత్సరానికి సుమారు 250 కోట్ల మందుల కొనుగోళ్లు జరిగినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ స్కామ్‌ దర్యప్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల వద్ద ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసింది. పలువురు అనుమతులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించిన పలు మెడికల్ ఏజెన్సీల కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతుంది.

నిన్న ఓమ్ని మెడి ఉద్యోగి నాగరాజు ఇంట్లో దొరికిన 46 కోట్ల నకిలీ ఇండెంట్ల ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.ఈ స్కామ్‌లో నకిలీ ఇండెంట్లపై పలువురు ఈఎస్ఐ ఉద్యోగుల సంతకాలు గుర్తించారు.ప్రయివేటు వ్యక్తుల ఇళ్లతో పాటు అధికారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ.. ఈ రోజు ,లేదా రేపు మరికొంత మంది అరెస్ట్ కు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది.

- Advertisement -