తప్పు చేసిన ఎవరిని వదలను!

18
- Advertisement -

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. విశాఖలో మీడియాతో మాట్లాడిన విజయసాయి..తాను పంతం పడితే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిలో వైసీపీ వాళ్లయినా, ఇతర పార్టీల వాళ్లయినా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.

తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని…తాము అధికారంలోకి వచ్చిన తరువాత హద్దులు దాటిన వాళ్ల తోకలు కత్తిరించడం ఖాయమని హచ్చరించారు. టీడీపీ వాళ్లతో కుమ్మక్కై మా పార్టీ వాళ్లే నా మీద ఆరోపణలు చేయించారు…సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే మనిషి కాదు అన్నారు.

మూడు రోజులుగా మీడియా ట్రోలింగ్, కథనాలతో ఒక ఆదివాసీ మహిళను అవమానించారు… నిరాధారమైన వార్తలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధం అన్నారు. విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను…. పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ తో పాటు చట్టబద్ధమైన అన్ని సంస్థలకు ఫిర్యాదులు చేస్తాను అని వెల్లడించారు. త్వరలోనే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని…. కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ ఛానల్ నిర్వహిస్తానని విజయసాయిరెడ్డి అన్నారు.

Also Read:కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం

- Advertisement -