- Advertisement -
హైదరాబాద్‌లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ట్రాఫిక్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసినట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. భారీ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు రాత్రి 10 గంటల నుంచి ఉ. 8 గంటల వరకు మాత్రమే సిటీ లోకి అనుమతిస్తామని తెలిపారు. భారీ ట్రక్‌లు, లారీలు సిటీ లోకి రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతి ఉన్న మార్గాల ద్వారానే ఎంట్రీ ఇస్తామని తెలిపారు.
ఈ ఆంక్షలు ఫిబ్రవరి 20 నుంచే అమల్లోకి వచ్చాయంటూ ప్రకటన విడుదల చేశారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. రూల్స్ అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీనివాస్ రెడ్డి.
Also Read:Pawan:పవన్ కు ‘పొత్తు ఎఫెక్ట్’ తప్పదా?
- Advertisement -