రైతు కేంద్ర బిందువుగా కేసీఆర్ కొత్త రెవెన్యూ బిల్..

186
Prashanth Reddy

తెలంగాణ రైతు రెవెన్యూ కష్టాల నుండి,విఆర్వోల కబంధ హస్తాల నుండి విముక్తి చెందాలనే రైతు కేంద్ర బిందువుగా సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చారని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతుకు కేవలం పంట పండించడమే పనిగా ఉండాలి తప్పా..వేరే కష్టాలు ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కోసం కొత్త రెవెన్యూ చట్టం తేవడం సాహసోపేతమైన ప్రయత్నం అన్నారు.

ఈ కొత్త చట్టం చారిత్రాత్మకం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా రైతులు, పేదల సంక్షేమం కోసం ఎక్కడా వెనుకడుగువేయని దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి అన్నారు. ఇట్లాంటి సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్న. చారిత్రాత్మక ఘట్టంలో నన్ను భాగస్వామ్యం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని మంత్రి పేర్కొన్నారు.