రెండేళ్లలో కరీంనగర్‌కు రైలు:ఎంపీ వినోద్

467
mp vinod
- Advertisement -

వచ్చే రెండేళ్లలో కరీంనగర్‌ నుండి హైదరాబాద్‌కు రైల్వే లైన్ పూర్తవుతుందని తెలిపారు ఎంపీ వినోద్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో విద్యార్థులు నిర్వహించిన సభలో మాట్లాడిన వినోద్..కరీంనగర్‌ను పర్యాటకక్షేత్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామనీ, ఈ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే తప్పనిసరిగా సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అన్ని సామాజిక వర్గాల విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లీష్‌ విద్యను అందిస్తున్నామని చెప్పారు.

హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని, విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు కూడా మంజూరు చేస్తున్నామని చెప్పారు. కోటి ఎకరాలకు నీళ్లిచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని… వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు వినోద్‌.

గతంలో కరీంనగర్‌కు ఒక్క జాతీయ రహదారి కూడా లేదనీ, ఇప్పుడు నాలుగైదు జాతీయ రహదారులను మంజూరు చేయించామన్నారు.కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయనీ, ఢిల్లీలో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -