చిత్రలహరి.. క్లీన్ ‘యు’

348
chitralahari
- Advertisement -

ప్రీమ్‌ హీరో సాయి తేజ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. సాయిధరమ్ సరసన నివేదా పేతురాజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్‌గా నటిస్తుండగా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలె చిత్రలహరి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకుంది.

సింగిల్ కట్ లేకుండా క్లీన్ యు సర్టిఫికెట్‌ని పొందింది. కీలకపాత్రలో సునీల్ కనిపించనుండగా సాయితేజ్ కి మాత్రమే కాదు .. కల్యాణి ప్రియదర్శన్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి.

ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల ఈ సారి కూడా ఓ అందమైన ప్రేమకథనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సత్ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -