కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉంది వీరే!

122
rahul
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ-నెహ్రూయేతర కుటుంబాల్లోని వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ నేతలు సెప్టెంబరు 20లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నుకోనున్నారు. సెప్టెంబరు మొదటి వారంలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త సారథి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ తేదీని నిర్ణయించేందుకు త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. సెప్టెంబరు 7 నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ భారత్ జోడో పాదయాత్ర ప్రారంభంకానుండగా అంతలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో పలవురి పేర్లు వినిపిస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే, అశోక్ గహ్లోత్, సుశీల్ కుమార్ షిండే, డీకే శివకుమార్ కూడా ఉన్నారు.

- Advertisement -