- Advertisement -
కొత్తగా వచ్చిన మున్సిపల్ చట్టం ప్రజలకు భరోసా ఇస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని 16వ వార్డులో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్…రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారందరికీ ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
6 నెలల్లో సదాశివపేటలో నీటి సమస్యలేకుండా చూస్తామని తెలిపారు. కొత్తగా వచ్చిన మున్సిపల్ చట్టం ప్రజలకు భరోసా ఇస్తుందన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతి మున్సిపాలిటీకి ఉన్నతాధికారిని నియమించినట్లు తెలిపారు. మున్సిపల్ చట్టంతో పారద్శకత పెరుగుతుందన్నారు. 75 గజాలలోపు ఇల్లు కట్టాలంటే రూపాయి ఫీజు కడితే చాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -