న్యూజీలాండ్‌లో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్..

608
- Advertisement -

రాజ్య సభ సభ్యులు సంతోష్ కుమార్ జోగినపల్లి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ప్రచారం కల్పించడంలో భాగంగా ఇతర దేశాల్లో వివిధ ప్రముఖులు ఛాలెంజ్ స్వీకరించి ప్రచారం కల్పించడం విదితమే. ఇందులో భాగంగా సునీతవిజయ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కెల్స్టోన్ పార్లమెంటరీ నియోజకవర్గ జాతీయ పార్టీ ( నేషనల్ ) ఛైర్పర్సన్ బాల వేణు గోపాల్ రెడ్డి బీరం ఈ రోజు ఆక్లాండ్‌లోని తమ స్వగృహంలో పలు మొక్కలను నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను, వారసత్వ బాధ్యతగా స్వీకరించాలని కుమార్తె త్రిష రెడ్డికి అప్పగించారు.

Green Challenge

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుండి తమ కుటుంబం దాదాపు రెండు దశాబ్దాల నుండి వచ్చి ఇక్కడ ఉంటున్నామని.. ఇటీవల హైదరాబాద్ వెళ్ళినప్పుడు హరిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ల ప్రభావం వలన ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, కీసర ప్రాంతం అరకును తలపిస్తోందని తెలిపారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను యువత ముందుకు తీసుకు వెళ్లి అనుకున్న పది కోట్ల మొక్కల లక్ష్యాలను త్వరలో చేరుకోవాలని అభిలషించారు. న్యూ జీలాండ్ వలె త్వరలో పచ్చదనంతో నిండి హరిత తెలంగాణగా రూపుదిద్దుకొని భారతదేశానికి ఆదర్శ రాష్ట్రముగా నిలవాలని కోరుకుంటూ,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రచారం కల్పించే విధంగా తాను కూడా మురళి అన్ను , షాలిని వాధ్వాన్ , వినోద్ పటేల్ లను నామినేటే చేస్తున్నానని తెలిపారు.

- Advertisement -