తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటెందుకు కమలం పార్టీ గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలని పార్టీ జాతీయ నేతలు సైతం ముమ్మర ప్రయత్నాలు చేసిన ఫలితం మాత్రం బెడిసి కొట్టింది. కానీ లోక్ సభ ఎన్నికల్లో అలాంటి ఫలితం రిపీట్ కాకుండా ఏకంగా 10 స్థానాల్లో గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తోంది కాషాయ పార్టీ అధిష్టానం. తాజాగా 17 లోక్ సభ స్థానాలకు గాను కొత్త ఇన్ చార్జ్ లను నియమించింది. .
మల్కాజ్ గిరి – రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ – లక్ష్మణ్, జహీరాబాద్ – వెంకటరమణ రెడ్డి, మెదక్ – హరీష్ బాబు, హైదరాబాద్ – రాజాసింగ్, చేవెళ్ల – వెంకటనారాయణ రెడ్డి, నిజామాబాద్ – ఆలేటి మహేశ్వరరెడ్డి, ఆదిలాబాద్ – పాయల్ శంకర్, కరీంనగర్ – ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పెద్దపల్లి – రామారావు, నాగర్ కర్నూల్ – రంగారెడ్డి, భువనగిరి – ఏన్వి ఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ – మర్రి శ్రీధర్ రెడ్డి, నల్గొండ – చింతల రామచంద్ర రెడ్డి, మహబూబ్ నాగర్ – గరికపాటి మోహన్ రెడ్డి, ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి.. వంటి వారిని కొత్తగా నియమించింది.
ఇక త్వరలోనే పార్టీ అగ్రనాయకత్వం కూడా రాష్ట్రంలో పర్యటనలు చేసేలా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే ప్రస్తుతం బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు గట్టిగానే ఉన్నాయి. ఆ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. మరి ఇప్పుడు లోక్ సభ ఎన్నికల సమయంలో వాటన్నిటిని అధిగమించి పార్టీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా అనేది సందేహమే. మరి లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
Also Read:ఎలక్షన్ ఎఫెక్ట్ : ఆరు గ్యారెంటీల అమలు కష్టమేనా?