యాక్టివ్ పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పిన సోనియా గాంధీ..రాహుల్‌కు పూర్తిస్ధాయి పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. రాహుల్‌కు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేసింది.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నెహ్రూ – గాంధీ కుటుంబాలకు చెందినవారు కాకుండా ఇతరులు నాయకత్వం వహించవచ్చే అవకాశం ఉందని తెలిపింది. 2004లో మన్మోహన్ సింగ్‌కు ప్రధాని పదవి అప్పగించిన విషయాన్ని ఆమె గుర్తుచేసింది. ఇక అవసరమైతే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన సోనియా దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణం లేదని చెప్పింది.
ప్రజలకు రాహుల్ మరింత దగ్గర కావాల్సిన అవసరం ఉందని….పార్టీలో వ్యవస్థీకృత మార్పు జరగాలన్నారు. పార్టీలో నూతనొత్తేజం తేవడంతో సీనియర్లు,యువ నేతలతో సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మద్దతు ఉంటేనే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుందని..ప్రియాంక రాజకీయాల్లోకి రావడం,రాకపోవడం తన ఇష్టమని తెలిపింది. అయితే రాహుల్‌కి సలహాలిచ్చే ప్రయత్నం చేయబోనని..ప్రజలకు చేరువయ్యేందుకు మాత్రం నూతన శైలిని ఎంచుకోవాల్సిన అవసరమైతే ఉందని తెలిపింది సోనియా.