శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వినూత్నమైన టేకింగ్ తో.. ఒక కొత్త ఒరవడితో తెరకెక్కించిన శివ సినిమా ప్రేక్షకులు మరవలేని రీతిలో తెరకెక్కించాడు వర్మ. నాగార్జున హీరోగా నటించిన శివ చిత్రం ఇప్పటికీ చూస్తుంటే అంతే ఇంటెన్సిటీతో కనిపిస్తుంది. ఇప్పుడు వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫొటో షూట్ జరుగగా, ఆ చిత్రాలను నాగ్ అభిమానులతో పంచుకున్నారు. గన్ పట్టుకుని సీరియస్ గా చూస్తున్న నాగ్ లుక్స్ సూపర్బ్ గా ఉన్నాయి.
“28 సంవత్సరాల క్రితం ‘శివ’ సినిమా నా జీవితాన్ని మార్చింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో చిత్రం. మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతోంది. జీవితంలో నిత్యమూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా” అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. నాగ్ చేసిన ట్వీట్ చేశాడు. మరి ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి.