జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

18
- Advertisement -

దేశంలో కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. జూలై 1 నుండి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమలులోకి రానున్నాయి. ఈ చట్టాలు అమల్లోకి వస్తే బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు.

జీరో FIR ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులతోపాటు 15ఏళ్ల లోపు పిల్లలు, 60ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు తాము నివాసమున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు. మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.

Also Read:కీలక షెడ్యూల్‌లో నిఖిల్..స్వయంభూ!

- Advertisement -