సుప్రీంకు కొత్త న్యాయమూర్తులు

2
- Advertisement -

న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టుకు ఇటీవల జరిగిన న్యాయమూర్తుల పదోన్నతుల్లో భాగంగా ఐదుగురు నూతన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం విడుదల చేసింది.

జస్టిస్ శీల్ నాగు…ఈయన ప్రస్తుతం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. జస్టిస్ శ్రీ చంద్రశేఖర్.. ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా..ఈయన ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ అరుణ్ పల్లి…ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెంకిట సుబ్రమణి మోహన…ఒక పక్కన సిట్టింగ్ న్యాయమూర్తులకు పదోన్నతి కల్పిస్తూనే.. మరోపక్క సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహనను నేరుగా సుప్రీంకోర్టు బెంచ్‌కు ఎంపిక చేయడం ఇక్కడ విశేషం.

Also Read:మౌంట్ రష్‌మోర్‌పై ట్రంప్..!

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల నుండి అనుభవజ్ఞులైన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు బెంచ్‌ను విస్తరించడంలో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలవనుంది. నూతనంగా నియమితులైన ఈ న్యాయమూర్తులు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుండి 38 కి పెరగనుంది.

- Advertisement -