బాలయ్యకే ఏమిటీ పరీక్షలు ?.. అన్నట్టు కొత్త భామలు కావాలి !

54
- Advertisement -

మా బాలయ్యకే ఏమిటీ పరీక్షలు ? అంటూ నందమూరి అభిమానులు డీలా పడుతున్నారు. అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. కామెడీ వలయంలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ రావిపూడిని నమ్ముకుని యాక్షన్ బాక్సాఫీస్ ఒడ్డు దాటేది ఎలా ?, దీనికితోడు ఈ సినిమాలో బాలయ్య పాత్ర పై బోలెడు పుకార్లు. అతగాడు వృద్ధుడు అని కొన్ని రూమర్లు.. లేదూ.. జైలు నుంచి వచ్చే మిడిల్ ఏజ్ పర్సన్ అని మరి కొన్ని పుకార్లు. ఏది ఏమైనా నట సింహాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ అనిల్ రావిపూడికి ఉందా ?, ఎఫ్ 3 లోని ఆ ఒక్కటి రెండు యాక్షన్ సీక్వెన్స్ లనే కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయిన అనిల్ రావిపూడి.. ఇక బాలయ్యని పక్కా గాడ్ ఆఫ్ యాక్షన్ గా ఏం ఎలివేట్ చేయగలడు ?,

అసలు బాలయ్య అంతటి యాక్షన్ హీరోకి అనిల్ లాంటి కామెడీ డైరెక్టర్ ని ఫ్యాన్స్ ఎలా ఓన్ చేసుకుంటారా ?. బాలయ్య మాత్రం సదరు దర్శకుడిని ఓన్ చేసేసుకున్నాడు. ఆ కమిట్మెంటు ఇంకా ఏ ఇతర డొల్ల హీరోలకూ చేతనవుతుందా..? ఐనా సరే, మా బాలయ్య ఒప్పుకున్నాడు. అదీ మా బాలయ్య పెద్ద మనసు అంటే !! అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిజానికి అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా అనగానే సాధారణ ప్రేక్షకులు ఎగ్జైట్ అయ్యారు. కానీ.. ఫంక్తు బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఏ వినాయక్ తోనో.. లేకపోతే మళ్లీ బోయపాటి తోనే సినిమా చెయ్యొచ్చు కదా.. ! ఎందుకు కామెడీ డైరెక్టర్ తో రిస్క్ అంటూ సన్నాయి కూతలు కూస్తున్నారు. అందుకే, ఈ సినిమా విషయంలో నిఖార్సయిన బాలయ్య అభిమానులు ఎప్పటికప్పుడు అసంతృప్తిగానే ఉన్నారు.

ఏమైనా గానీ బాలయ్య, అనిల్ అరవిపూడితో సినిమాకి రెడీ అయ్యాడు. కూతురిగా శ్రీలీల నటిస్తోంది. మరి హీరోయిన్ మాటేమిటి ?, ఈ సినిమాని హీరోయిన్ల సమస్య చుట్టుముట్టింది. ఫామ్ లో ఉన్న ఏ కుర్ర భామ బాలయ్య సరసన సొగసుల గుమగుమలను వెదజల్లడానికి సాహసం చేయడం లేదు. కాబట్టి బాలయ్యకి ఎప్పటిలాగే ముదురు భామలే దిక్కు. పైగా అందులో నుంచి నయనతారను, త్రిష ని తీసేయాలి. అంత బడ్జెట్ లేదు ఇక్కడ. ఇక ఉన్న లిస్ట్ లో నుంచి బెటర్ ఆప్షన్స్ ను చూసుకుంటే.. ప్రగ్యా జైస్వాల్ – కేథరీన్ థెరీసా బాలయ్యకి సెట్ అవుతారు. కానీ.. వీళ్ళ పై అనిల్ రావిపూడికి మనసు రావడం లేదు. అందుకే కొత్త భామల కోసం ప్రస్తుతం వేట మొదలెట్టారు.

ఇవి కూడా చదవండి..

 

 

- Advertisement -