ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

204
ramnath-kovind
- Advertisement -

దసరా పండుగ వేళ ఆయా రాష్ట్రాలకు గవర్నర్లు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వచ్చారు. ఐదు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి  కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా బనర్విలాల్ పురోహిత్, మేఘాలయ గవర్నర్‌గా గంగాప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బి.డి. మిశ్రా, బీహార్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ నియామకం అయ్యారు. అండమాన్, నికోబార్ దీవులు లెఫ్టినెంట్ గవర్నర్‌గా దేవేంద్ర కుమార్ జోషిని నియమించారు. ప్రొఫెసర్ జగదీష్ ముఖి స్థానంలో దేవేంద్ర కుమార్ జోషి నియామకం అయ్యారు. జగదీష్ ముఖిని అసోం గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

- Advertisement -