వెండితెరపై ఢిల్లీ మర్డర్‌ కేసు…

91
- Advertisement -

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్దా వాకర్. దేశరాజధానిలో జరిగిన శ్రద్దావాకర్ హత్య జరిగిన విధానం వింటుంటే ఒళ్లు గగురుపోడుస్తుంది. కనీసం దహనసంస్కారాలకు కూడా నోచుకొలేని స్థితిలో శ్రద్దావాకర్‌ చనిపోయిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె మర్డర్ కేసు అందరి హృదయాలను కదిలించింది. రోజుకో ట్విస్ట్ భయటపడుతుండడంతో సామాన్యులే కాదు.. పోలీసులు సైతం షాక్ అవుతున్నారు.

ప్రేమ ముసుగులో జరిగిన ఈ హత్య నరరూప రాక్షసుడు అయిన ప్రేయసి చేతిలో బలైన అమ్మాయి నిజ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుందని బాలీవుడ్‌లో టాక్. సంచలనం సృష్టిస్తోన్న శ్రద్దావాకర్‌ హత్య కేసు ఇప్పుడు వెండితెరపైకి వస్తదని ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్ మనీష్‌ సింగ్ తెలిపారు.

శ్రద్ధా వాకర్ హత్య కేసుపై సినిమా తీస్తున్నట్లు నిర్మాత-దర్శకుడు మనీష్ ఎఫ్ సింగ్ ముంబైలో ప్రకటించారు. తాను తెరకెక్కించే సినిమా అఫ్తాబ్ తన ప్రేయసి శ్రద్దా వాకర్ హత్య నుంచి ప్రేరణ పొందుతుందని చెప్పారు. త్వరలోనే నటీనటులను పరిచయం చేస్తామన్నారు. ప్రేమ పెళ్లి అంటూ అబ్బాయిలను నమ్మి తమ జీవితాలను ఎలా నాశనం చేస్తున్న విధానం గురించి మాత్రమే ఈసినిమాలో ఉంటుందని అన్నారు.

అమ్మాయిల వారికి లైఫ్ లేకుండా చేస్తున్న ప్రేమపిశాచాల గురించి ఈ సినిమాలో బయటపెడతానని అన్నారు. బృందావన్ ఫిల్మ్స్ పతాకంపై మనీష్ ఎఫ్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు సినిమా స్క్రిప్ట్‌ తయారు చేయమని…ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో గల అడవుల్లో లొకేషన్‌ కూడా వెతుకుతున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

అల్లు స్నేహారెడ్డి – జాన్వీ కపూర్… అదే డ్రెస్, అవే అందాలు !

విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ ట్రైలర్

రేటును అమాంతం తగ్గించేసింది.. మరీ పిలుస్తారా ?

- Advertisement -