అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు..

12
- Advertisement -

దేశ వ్యాప్తంగా నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రానున్నాయి. బ్రిటీష్ కాలం నాటి పనికిరాని కొన్ని క్లాజులను తొలగించి కొన్ని కొత్త విషయాలను చేర్చారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌(సీఆర్‌పీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్‌) అమల్లోకి వచ్చాయి.

146 మంది ఎంపీలను పార్లమెంటు కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేయడం ద్వారా ఈ చట్టాలను “బలవంతంగా” ఆమోదించారని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పేర్కొంది.ఈ చట్టాలలో 90 శాతం “కట్, కాపీ అండ్ పేస్ట్ జాబ్” అని కూడా పార్టీ పేర్కొంది.

కొత్త చట్టాల్లో కీలక నిబంధనలు చేర్చారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెక్స్‌ యాక్ట్‌కు చెల్లు కాగా ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలోనూ సమన్లు జారీ చేస్తారు. క్రైమ్‌ సీన్లకు తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయాలని…కేసు విచారణలో జాప్యం నివారణకు కోర్టులో రెండు వాయిదాలకే అవకాశం ఉండేలా చట్టంలో పొందుపర్చారు. విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లోగా తీర్పు వెలువరించాలని ఈ చట్టాల్లో పేర్కొన్నారు.

Also Read:NEET UG:రీఎగ్జామ్‌.. ఫలితాలు విడుదల

- Advertisement -