బ్రిటన్‌ను మరో కొత్త వేరియంట్ కళవరపెడుతోంది. ఇప్పటికే కరోనాతో అతలాకుతలమైన బ్రిటన్..తర్వాత డెల్టా వేరియంట్‌తో తీవ్రంగా నష్టపోయింది .తాజాగా మరో కొత్త వేరియంట్ బ్రిటన్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బి.1.621 రకం వేరియంట్ 16 మందిలో గుర్తించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ఈ వేరియంట్ పై పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాల వలన ఈ కేసులు వచ్చి ఉండోచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ వ్యాప్తి ఎలా ఉంది, సామూహిక వ్యాప్తి చెందుతుందా అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బ్రిటన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ బి.1.621 రకం వేరియంట్ మొదట జనవరిలో కొలంబియాలో గుర్తించగా ఈ వేరియంట్‌కు చెందున కేసులు అమెరికాలో 592, పోర్చుగల్‌లో 56, స్వట్జర్లాండ్‌లో 41, జపాన్‌లో 47 కేసులు ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.