గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నూతన వధువరులు..

60
New Couple Planted Saplings

ఇనుముల విజయ్- మహితల వివాహం పద్మనాయక్ కళ్యాణ మండపం కరీంనగర్‌లో జరిగింది. ఈ శుభసందర్బంగా పర్యావరణ ప్రేమికుడు, గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ పేరు మీద, కరీంనగర్ మేయర్ సునీల్ రావ్ సమక్షంలో నూతన వధువరులు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ.. వాతావణంలో వచ్చే పెను మార్పులను ఎదుర్కోవాలి అంటే పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటాలి. యువత స్వంచందంగా పాల్గొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో నూతన వదువరుల తల్లితండ్రులు కూడా పాల్గొన్నారు.