కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 75 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం రాష్ట్రంలో 229 పాజిటివ్ కేసులు నమోదు చేసుకున్నాయి. ఈ రోజు 15 మంది కరోనా బాధితులను డిశ్చార్జ్ చేశాం. ఇప్పటి వరకు మొత్తం 32 మంది డిశ్చార్ అయ్యారు. ఈ రోజు ఇద్దరు మృతి చెందగా, రాష్ట్రంలో కరోనా వల్ల 11 మంది మృతి చెందినట్లు నమోదైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 186 మంది పాజిటివ్ కేసులు చికిత్స తీసుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇక మర్కజ్ నుంచి వచ్చిన వారందరిని గుర్తించామని. వచ్చిన వారిలో లక్షణాలు ఉన్నవారిని, వారి కుటుంబ సభ్యులకు ఐసోలేషన్ సెంటర్స్‌కు తరలించి కరోనా పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆరు ల్యాబ్‌లలో 24 గంటలు మూడు షిఫ్టుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ రోజు షాద్‌నగర్‌కు చెందిన వ్యక్తి, సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి ఇద్దరు మృతి చెందారు. మృతులు ఎవరెవరిని కలిశారో వారి గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు.