- Advertisement -
దేశ సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు 49వ ప్రధానమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు ఉదయ్ ఉమేశ్ లలిత్. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిల్ లలిత్‌తో ప్రమాణం చేయించగా ఈ ఏడాది నవంబర్ 8 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. 1983 జూన్‌లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన ఆయన 1986 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. 2014లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
- Advertisement -