కొత్త 1000 నోటుకు ముహుర్తం కుదిరింది..!

441
Notes 1000
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఒకవైపు హర్షిస్తూనే, మరోవైపు అమలులో విఫలమైందని మండిపడుతున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొత్త 2వేల..500 వందల నోట్లు చాలినంతగా చలామణిలోకి రాకపోవడం..2 వేల నోటుకు చిల్లరదొరకపోవడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ఇదిలా ఉంటే రద్దైన వెయ్యి, 500 నోట్లలో ఒక్క 500 నోటునే కొత్తగా ముద్రించిన కేంద్ర ప్రభుత్వం..వెయ్యి నోటును కూడా కొత్తగా డిజైన్ చేసి ప్రవేశపెట్టాలని చూస్తోందట. ఇప్పటికే దీనిపై ఆర్భీఐ, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయట.

india_rbi_1000_

ఈ వెయ్యి రూపాయల నోటు బ్యాంకుల్లోకి, అక్కడి నుంచి జనం జేబుల్లోకి రావాలంటే కొత్త సంవత్సరం వచ్చే దాకా ఆగక తప్పదని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వెయ్యి రూపాయల నోటును ప్రవేశపెడుతున్నట్లు డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. అంతేకాదు, కొత్తగా 20రూపాయలు, 50 రూపాయల నోటును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐయే తెలిపింది. పాత 20, 50 నోట్లు యథాతథంగా ఉంటాయని, వాటికి తోడు కొత్త నోట్లు చలామణీలోకి తేవాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

- Advertisement -