తానెప్పుడూ అంబేద్కర్‌ని అవమానించలేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ తన మాటను వక్రీకరించిందని ఆరోపించారు.అంబేద్కర్ అనడం ఫ్యాషనైపోయింది.. ఇన్నిసార్లు దేవుడిని స్మరిస్తే స్వర్గానికైనా వెళ్లొచ్చు అని రాజ్యసభలో అమిత్ షా పేర్కొనగా దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి.
అమిత్ షా ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని…హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది టీఎంసీ. బీజేపీ కార్యాలయం ముందు కేజ్రీవాల్ ధర్నా చేపట్టగా దిద్దుబాటు చర్యలకు దిగారు ప్రధాని మోదీ.
అంబేద్కర్‌ను గౌరవిస్తున్నది తామేనని వెల్లడించారు. అంబేద్కర్ పేరును బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ, నెహ్రూ తర్వాత ఇప్పుడు అంబేద్కర్‌ను బీజేపీ అవమానిస్తున్నదని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ మండిపడ్డారు.
అంబేద్కర్ మార్గదర్శకత్వంలో నడిచే లక్షలాది మందికి షా వ్యాఖ్యలు అవమానకరమని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ముసుగు తొలిగిపోయిందన్నారు.
Also Read:31 మందితో జేపీసీ..ప్రియాంకకు చోటు!