బాలయ్యతో ఆ…రోజును మర్చిపోలేను

295
I never forgot Balakrishna says Roja
- Advertisement -

రోజా.. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి, టాప్ హీరోయిన్ గా రాణించింది. ఆ తరువాత తమిళ దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఒక వైపు ప్రజాప్రతినిధిగా ఉంటూనే రోజా పలు తెలుగు ఛానళ్లలో హోస్ట్ గా, న్యాయనిర్ణేతగా.. చేస్తోంది. ఇటీవల ఎప్పుడూ పర్సనల్ విషయాలు మాట్లాడని రోజా దీపావళి సందర్భంగా కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. రోజాకు దీపావళి పండుగ అంటే చాటా ఇష్టమట. అందుకే దీపావళి రోజు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

దేవుడన్నా, పండుగలన్నాముందునుంచే భక్తి ఎక్కువన్న రోజా…దీపావళి మా కుటుంబానికి చాలా ప్రత్యేకమని తెలిపింది. మాపిల్లలకు దీపావళంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం మా అన్నయ్యగారి పిల్లలు మాఇంటికే వస్తారు. అందరం కలిసే మా ఇంట్లోనే దీపావళి జరుపుకుంటాం.నేను ఎంత పెద్ద హీరోయిన్‌ని అయినా నాకు కూడా పండుగ అంటే కొత్త బట్టలు, టపాసులు, మిఠాయిలు, సినిమాలు అన్నీ ఉండాల్సిందేనని తెలిపింది.

Roja

ప్రతి దీపావళి తనకు ఎన్నో ఙ్ఞాపకాలను మిగిల్చుతోందని రోజా తెలిపారు. అయితే, ‘పెద్దన్నయ్య’ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు.. తాను, బాలకృష్ణ కలిసి జరుపుకున్న దీపావళి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని చెప్పారు. ఆ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా దీపావళిని జరుపుకున్నామని గుర్తు చేసుకున్నారు. తనతోపాటు అందరూ బాగుండాలని, తన వల్ల పది మందికి మంచి జరగాలని ఎప్పుడూ భగవంతుడిని కోరుకుంటానని తెలిపింది.

బాలయ్య సరసన రోజా నటించిన భైరవ ద్వీపం సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ రాజకీయాల్లో అడుగుపెట్టిన నేపథ్యంలో అధికార,ప్రతిపక్ష పార్టీల్లో కీలక నేతలుగా ఉన్నారు.

I never forgot Balakrishna says Roja

- Advertisement -