ఆ…పని చేయనంటున్న ‘ప్రేమమ్’ పల్లవి

311
Sai Pallavi talks about rumours
- Advertisement -

ప్రేమమ్ మలర్ టీచర్ గుర్తుందా? మరిచిపోయేలా ఉందా అమ్మాయి అంటారా? అంతేలేండి ఒక్క సినిమాతో ఎంతో మంది కుర్రకారుల హృదయాలాను దోచేసుకోవడం అంటే మామూలు మాటలు కాదు! అందం తో పాటు అభినయం కావలసిన మోతాదులో కలిసి నిలువెత్తు మనిషి రూపం దాల్చితే ఎలా ఉంటుంది అంటే సాయి పల్లవిని చూపించచ్చు.

ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించని ఈ భామకు అభిమానులు మాత్రం పుష్కలంగా ఉన్నారు. కారణం.. సాయిపల్లవి మలయాళంలో చేసిన ప్రేమమ్ మూవీ. ప్రేమమ్ తొలిసినిమా అయినా భాషతో సంబంధం లేకుండా అందరిని తన నటనతో ముగ్గులోకి దించింది ఈ భామ. కనీసం మేకప్ కూడా లేకుండా సాయిపల్లవి చూపించిన అభినయం అందరిని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు అదే రేంజ్ లో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్ని నేరుగా ఫిదా చేసేందుకు వస్తోంది ఈ నాచురల్ బ్యూటీ. వరుణ్ తేజతో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఫిదా సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.

Sai Pallavi talks about rumours

తాజాగా మరో ఆఫర్‌ వచ్చినా తిరస్కరించింది ఈ ముద్దుగుమ్మ. ఓ సినిమాలో హాట్ సీన్ చేసేందుకు అమ్మడును సంప్రదించారని కానీ అందుకు ఆమె నో చెప్పిందని వార్తలొచ్చాయి. అయితే, ఇవన్నీ వదంతులేనని పల్లవి కొట్టిపారేసింది. అసలు తనకు ఎలాంటి కోలీవుడ్ ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చింది.ఒకవేళ అలాంటి ఆఫర్లు వచ్చినా తన అభిరుచి గల సినిమాల్లోనే తాను నటిస్తా తప్ప ఎవరో చెప్పారని మాత్రం తాను సినిమా చేయనని చెబుతోంది. అంతేకాదు పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చినా సరే, తను మాత్రం తనకు నచ్చిన పాత్రలనే చేస్తుందట ఈ బ్యూటీ.

శేఖర్ కమ్ముల చేతిలో పడ్డ హీరోయిన్లందరికి మంచి పేరు వచ్చింది. తమన్నా లాంటి భామ అయితే టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇప్పుడు అదే రేంజ్ లో సాయి పల్లవి కూడా టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ప్రేమమ్ తో తన డ్యాన్స్ వైవిధ్యాన్ని చూపించిన సాయిపల్లవి…ఫిదాతో మైమరిపిస్తుందో లేదో చూడాలి.

Sai Pallavi talks about rumours

- Advertisement -