దీనిపై కూడా రాజకీయమా.. తూ!

70
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి గౌరానికి ప్రతీకగా ఉండే సెక్రటరీయెట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా.. యావత్ భారతావని కూడా తెలంగాణ వైపు చూసి ఉప్పొంగేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ నూతన సచివాలయ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 28 ఎకరాల ప్రాంగణంలో 2.5 ఎకరాలలో ఈ నూతన సచివాలయ భవనాన్ని నిర్మించారు. 2019 జూన్ 27 న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయిన ఈ భవన నిర్మాణం.. 26 నెలల పాటు నిర్విరామంగా పనులు జరుపుకొని ఎట్టకేలకు పూర్తి అయింది. తెలంగాణ ఖ్యాతి దశ దిశల వినిపించేలా ఎంతో విజన్ తో ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ చేపట్టిన ఈ మహత్తర భవన నిర్మాణం చూసి ఇతర రాష్ట్రాలు ముక్కున వేలేసుకునే పరిస్థితి. .

తెలంగాణ ప్రజలు నూతన సచివాలయ భవన క్షోభను చూసి గర్వంతో ఉప్పొంగుతున్న వేళ.. నేటి నుంచి ( ఆదివారం ఏప్రెల్ 30 ) ఈ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. కాగా తెలంగాణ ప్రతీకను చాటిచెప్పే నూతన సచివాలయం విషయంలో కూడా బీజేపీ విషం చిమ్ముతోంది. అందరికీ సర్వ హక్కులు ఉన్న సచివాలయాన్ని ఏదో ఒక మతానికి అంటగట్టి రాజకీయ లభ్ది కోసం చూస్తోంది కాషాయ పార్టీ. నూతన సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ఆ పార్టీలో కాళకోఠ విషం ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుంది.

Also Read:CM KCR:ఇది తెలంగాణ పునర్మిర్మాణం అంటే

” సచివాలయ నిర్మాణంలో హిందువుల వాటా రెండు గుంటలే. అని చెప్తూ తాము అధికారంలోకి వస్తే సచివాలయంలో మార్పులు చేస్తాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ పెద్దల కాళ్ళ వద్ద ఉంచిన నువ్వు.. సచివాలయంపై కూడా రాజకీయం చేయడం మానవా ? అంటూ ఏకీపరేస్తున్నారు నెటిజన్స్. రాబోయే తరాలకు గొప్ప విజన్ సచివాలయ నిర్మాణం చేసిన ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ పై దేశం నలువైపులా ప్రశంశలు జల్లు కురుస్తుంటే.. దీన్ని కూడా రాజకీయం చేయడం ఒక్క బీజేపీ నేతలకే చెల్లిందని బండి తీరును ఎండగడుతున్నారు నెటిజన్స్.

Also Read:కొత్త సచివాలయం… ఏఏ అంతస్తులో ఏఏ శాఖలంటే?

- Advertisement -