నీలాంటి చిల్లర నాయకుడిని ఎక్కడా చూడలేదు.. రేవంత్‌పై నెట్‌జన్ల ఫైర్..

51
- Advertisement -

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు..అవసరాలకు తగ్గట్లుగా అందరూ సమయానుకూలంగా ప్రవర్తిస్తుంటారు. ఇవాళ కత్తుల దూసుకున్న నాయకులే…రేపు చేతులు కలిపాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని రాజకీయ నేతలు సమయానుకూలంగా వ్యవహరిస్తుంటారు. అయితే ప్రత్యర్థులపై రాజకీయపరమైన విమర్శలు ఉండాలె కాని వ్యక్తిగత దూషణలకు తావు ఇవ్వకూడదు. ముఖ్యంగా పార్టీ అధినేతలు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉండదు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాలు హుందాగా నడిచాయి. ప్రతిపక్ష నాయకులుగా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష‌్మణ్ వంటి నేతలు హుందాగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్‌పై రాజకీయపరమైన విమర్శలు చేసేవారు…కాని ఏనాడు వ్యక్తిగతంగా దూషించలేదు..కాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి, బీజేపీకి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా అయిన తర్వాత రాజకీయ విమర‌్శల స్థానే వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత పెరిగింది. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు ఇద్దరూ ఇద్దరే..సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబసభ్యులపై నోటికి వచ్చినట్లు బూతులు తిట్టడంలో, వ్యక్తిగతంగా దూషించడంలో పోటీపడుతుంటారు.

అయితే బండి సంజయ్‌తో పోలిస్తే రేవంత్‌రెడ్డికి కాస్త బుర్ర ఉంది…..అయితే బండితో పోలిస్తే.. రేవంత్‌‌కు లేనిదల్లా కాస్త ఇంగిత జ్ఞానమే..సీఎం కేసీఆర్‌ బర్త్‌డే సందర్భంగా బండి సంజయ్ హుందాగా ప్రవర్తించగా…టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాస్తా చిల్లరగా వ్యవహరించి…నైతికంగా మరింత దిగజారారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలు, థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బావుల కాడ మీటర్ల విషయంలో బండి సంజయ్ చేసిన విమర్శలకు కౌంటర్‌గా బండికి చదువురాదు..బీజేపీ ఇజ్జత్ తీస్తుండు…ఆయన్ని అర్జెంట‌‌్‌గా పదవి నుంచి పీకేయండి…లేకుంటే పార్టీ పరువు పోతుంది అంటూ సీఎం కేసీఆర్ చురకలు అంటించారు. ఈనేపథ్యంలో ఫిబ్రవరి 17 న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీతో సహా, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌తో పాటు, వివాదాస్పద అసోం బీజేపీ సీఎం హిమంత బిశ్వశర్మ కూడా శుభాకాంక్షలు తెలిపి తమ హుందాతనాన్ని చాటుకున్నారు.

అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగత కక్షతో సీఎం కేసీఆర్ బర్త్‌డే రోజు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కాదు..12 రోజుల చావు దినాలు చేసుకోవాలి…రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గాడిదలకు కేక్ కోసి బర్త్‌డే వేడుకలను చేయాలని ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చాడు. అంతే కాదు స్వయంగా ట్విట్టర్‌‌‌లో ఊసరవెల్లి ఫోటోకు జన్మదినశుభాకాంక్షలు అంటూ పరమ చీప్ ట్వీట్ చేశాడు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలే తప్పా..ఇలా వ్యక్తిగతంగా తీసుకోకూడదు..పుట్టినరోజు నాడు రాజకీయ ప్రత్యర్థుల చావు కోరడం అత్యంత నీచం… మొత్తంగా సీఎం కేసీఆర్ బర్త్‌డే రోజు ఆయనకు విషెస్ చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన హుందాతనాన్ని చాటుకోగా… రేవంత్ రెడ్డి మాత్రం అత్యంత చిల్లరగా ప్రవర్తించిన తాను పీసీసీ చీఫ్ కాదు చీప్ అనిపించుకున్నారని సోషల్ మీడియాలో నెట్‌జన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగో రవ్వంతా బుడ్డరఖాన్….. బండి సంజయ్‌కు ఉన్న ఇంగితజ్ఞానం కూడా నీకు లేకపోయే…మరీ నీలాంటి చిల్లర నాయకుడిని ఎక్కడా చూడలేదని టీఆర్ఎస్ అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.

- Advertisement -