కళాతపస్వికి పుట్టిన రోజు శుభాకాంక్షలు: చిరు

41
chiru

కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కె.విశ్వనాథ్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో మ‌రుపురాని చిత్రాలు అందించి త‌న‌కంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు. శంక‌రాభ‌ర‌ణం చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతి ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేశారు. ఇక ఆయన పుట్టిన ఈ సంద‌ర్భంగా రోజు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన, ఎంత‌గానో గౌర‌వించే కే విశ్వ‌నాథ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు మెగాస్టార్‌.

గురుతుల్యులు, పితృ సమానులు, మహోన్నత దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన కళాతపస్వి విశ్వనాథ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన తీసిన ప్రతి చిత్రం ఒక ఆణిముత్యమని, తెలుగువారికి చిరస్మరణీయమని ఈ సందర్భంగా చిరంజీవి కొనియాడారు. విశ్వానాథ్ గారు ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.