నేటితో నామినేషన్స్.. క్లోజ్ !

57
- Advertisement -

రోజురోజుకూ కర్నాటక ఎలక్షన్స్ ఫీవర్ మరింత పెరుగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుండడంతో అసలు విజయం ఏపార్టీని వరిస్తుందో అని దేశమంతా కర్నాటక వైపు చూస్తోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈసారి కర్నాటక ఎలక్షన్ లో విజయం, పై కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక జేడీఎస్ పార్టీ వీలైతే అధికారం లేదంటే కింగ్ మేకర్ మా మారాలని చూస్తోంది. ఇక ప్రతిపార్టీ కూడా స్పష్టమైన ఎజెండాతో ఉండడంతో కర్నాటక ఎలక్షన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల పరిశీలనపై తర్జన భర్జన పడిన ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలనే రేస్ లో నిలబెట్టాయి. ఈసారి బీజేపీ దాదాపు 50 శాతం కొత్తవారికి అవకాశం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

Also read: కాంగ్రెస్ కల్లోలం ఇప్పట్లో తగ్గదా ?

అయితే పార్టీలోని సీనియర్స్ బీజేపీవీడడం ఆ పార్టీని కలవరపెట్టే అంశం. మరోవైపు గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించి, విజయం ధీమాగా ఉంది కాంగ్రెస్. ఇక జేడీఎస్ కూడా పొత్తు పార్టీలను కలుపుకొని ఫైనల్ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించేసింది. ఈ ప్రధాన పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఏం ఐ ఏం పార్టీలు కూడా బరిలో దిగబోతున్నాయి. దాంతో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో ఏ పార్టీ ఆధిక్యం ప్రదర్శించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక నేటితో నామినేషన్స్ ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ఇక వచ్చే నెల 10న ఎన్నికలు జరగనుండగా 13న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తానికి కర్నాటక ఎలక్షన్ పై అందరి దృష్టి నెలకొంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కన్నడీకులు అధికారాన్ని కట్టబెడటారో చూడాలి.

Also read: కర్నాటకలో ఫ్యామిలీ పాలిటిక్స్ !

- Advertisement -