రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఆమె పోషించిన అచ్చియమ్మ పాత్రను దర్శకుడు బుచ్చిబాబు సన అత్యంత వివాదాస్పదంగా..మహిళలను కించపరిచే విధంగా మరియు శృంగార వస్తువుగా చూపించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగులపై ప్రేక్షకులు మరియు సినీ విమర్శకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ట్విట్టర్ (X) మరియు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు చిత్రబృందంపై ధ్వజమెత్తుతున్నారు. కేవలం గ్లామర్ కోసమే జాన్వీ కపూర్ పాత్రను వాడుకున్నారని, రొమాన్స్ పేరుతో అసభ్యతను ప్రమోట్ చేశారని ఆరోపిస్తున్నారు.దర్శకుడు బుచ్చిబాబు సన మహిళల పాత్రలను గౌరవప్రదంగా చూపించడంలో విఫలమయ్యారని, కేవలం పురుష ప్రేక్షకుల అటెన్షన్ కోసమే జాన్వీ కపూర్ బాడీ లాంగ్వేజ్‌ను, హావభావాలను తప్పుగా వాడుకున్నారని నెటిజన్లు రాసుకొస్తున్నారు.
Also Read:గ్రేట్ నికోబార్‌ను కాపాడుకుందాం!
గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో, ఇలాంటి సమస్యాత్మకమైన సన్నివేశాలు మరియు మహిళలను తక్కువ చేసి చూపించే కథాంశానికి ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో ఈ వివాదం ముదురుతున్న సమయంలో ‘పెద్ది’ చిత్రం ఒక నటికి జరిగిన ‘అత్యంత ఖరీదైన అవమానం’ అంటూ ఒక సినీ విమర్శకుడు పెట్టిన పోస్ట్‌ను జాన్వీ కపూర్ కూడా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

