నెట్టింట్లో లోకేష్ బాబు హల్ చల్..మాటలతో కాదు..!

282
lokesh nara
- Advertisement -

నారా లోకేష్‌..తెలుగు రాష్ట్ర ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు. చంద్రబాబు కొడుకుగా బుల్ బుల్ బాలయ్య అల్లుడిగా కంటే తన మాటతీరుతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటారు. ఎవరిపైనైనా ఫన్నీ సెటరైర్లు వేయాలన్నా…వెక్కిరియాలన్న నెటిజన్లకు గుర్తొచ్చేది లోకేష్ బాబే. అంతగా నెటిజన్లకు ప్రియనేస్తం అయిన లోకేష్‌ మరోసారి హైలైట్ అయ్యారు.

మూడు సంవత్సరాల క్రితం సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్,కాంగ్రెస్‌ పార్టీలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు లోకేష్‌. 12 సంవత్సరాల్లో ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్‌లో మెట్రో రైలును కట్టలేకపోయారు అంటూ ఎద్దేవా చేశారు. అంతేగాదు ఏపీలో టీడీపీ 2018 డిసెంబర్ నాటికి మెట్రోని పూర్తిచేసి పరుగులు పెట్టిస్తుందని ఉత్తరకుమార ప్రగళ్బాలు పలికారు.

అయితే ఇప్పుడు ఆ ట్వీటే లోకేష్ కొంపముంచింది. 2018 ముగిసింది..మెట్రో రైలు ఎక్కడా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈసారి విజయవాడ వెళ్లినప్పుడు మెట్రో ఎక్కుతానంటూ ఒకరు,లోకేష్ అన్న నాకొక బాల్కనీ టికెట్ అంటూ మరొకరు జోకులు పెలుస్తున్నారు. మరికొంతమది వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు. మెట్రోను కృష్ణానది కింద కట్టారా,అసలు లోకేష్ దృష్టిలో మెట్రో అంటే మెట్రో షూ కంపెనీ,మెట్రో క్యాష్ అండ్ క్యారీ సూపర్ మార్కెట్ అంటూ ఎద్దేశా చేస్తున్నారు.

లోకేష్‌ ఇలా నెటిజన్ల చేతిలో చిక్కడం తొలిసారి కాదు. గతంలో టీడీపీకి ఓటేస్తే మనకు మనం ఊరి వేసుకున్నట్లే అని వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్న లోకేష్ బాబు తన పద్దతిని ఏమాత్రం మార్చుకోలేదు. అంబేద్కర్ జయంతిని వర్దంతి చేయడం,మంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో సార్వ భౌ..భౌ అంటూ పలకడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాకినాడ లో ‘రాబోయే రెండేళ్లలో అన్నిగ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యం అని ప్రకటించడం, అనంతపురం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని పప్పులో కాలేయడం పరిపాటిగా మారింది. అంతేందుకు గతేడాది స్వాతంత్ర్యం వచ్చి 66 ఏళ్లయిందంటూ వ్యాఖ్యానించి విమర్శలపాలయ్యారు.

మాటల్లోనే కాదు కనీసం ట్వీట్ చేసేటప్పుడు కూడా ఇదే మేనరిజాన్ని ఫాలో అవుతారు లోకేష్‌.అమరావతిలో మండలి చైర్మన్‌ చక్రపాణి గారిని కలుసుకోవడం సంతోషంగా ఉంది..’ అంటూ టీడీపీ నేతలు కలిసి ఫోటోను షేర్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు.

Lokesh agains mistakes..!

- Advertisement -