తండ్రి కొడుకుల రాజీ కుదిరింది..!

221
Akhilesh
- Advertisement -

సమాజ్‌వాది పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ములాయం, అఖిలేష్‌ మధ్య రాజకీయ విభేదాలతో రెండుగా చీలిన సమాజ్ వాది పార్టీ లో మళ్లీ సయోధ్య కుదిరినట్టు తెలుస్తోంది. పార్టీ చీలిపోతే వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని గ్రహించిన తండ్రి కొడుకులు ఇద్దరు..పార్టీలో నెలకొ్న్న సంక్షోభాన్ని సద్దుమణిగించే దిశగా అడుగులు వేస్తున్నారు. విభేదాలను పరిష్కరించుకునేందుకు సీనియర్‌ మంత్రి ఆజాంఖాన్‌ మధ్యవర్తిత్వంతో ములాయం, అఖిలేశ్‌ సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ భేటీ పలప్రదమైనట్టు సమాచారం. తండ్రీకొడుకుల మధ్య రాజీ కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని అఖిలేశ్ ప్రతిపాదించారని సమాచారం.

 Akhilesh

శివపాల్‌ యాదవ్‌ ను ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఢిల్లీకి పంపాలని షరతు విధించినట్టు తెలుస్తోంది. కుమారుడు విధించిన షరతుకు ములాయం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలంటే..ఇక నుంచి ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా జరుగుతున్న గందరగోళానికి పుల్ స్టాప్ పడే దిశగా పార్టీ కీలకనేతలు అడుగులు వేస్తుండంతో…పార్టీ శ్రేణులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -