నెపో కిడ్‌ ట్రోల్స్ పై జాన్వీ రియాక్షన్

51
- Advertisement -

శ్రీదేవి వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్‌…తొలి ప్రయత్నంలో అనేక కష్టాలకు గురైనట్టు తెలిపింది. సినిమా సినిమాకు తనలో పరిణితి చెందుతూ…లోపాల్ని అధిగమిస్తూ నటనను ఇంప్రూవ్ చేసుకుంటు వెళ్లేదాన్ని అన్నారు. సినిమా అంటే గ్లామర్ తో పాటుగా అందం, అభినయం కలిగి ఉంటేనే రాణిస్తారని తను మొదట్లో నమ్మేదాన్ని. అయినప్పటికీ నాపై విమర్శలు ఆగలేదని అన్నారు. ఈమెకు నటన రాదు అంటూ చేసిన ట్రోల్స్‌, తనను ఇబ్బంది పెట్టినట్టు తెలిపింది. అయితే తాజాగా ట్రోల్స్‌పై జాన్వీ కపూర్‌ స్పందించింది.

తనపై వస్తున్న ట్రోల్స్‌ చూసి చూసి విసిగిపోయానని జాన్వీకపూర్ చెప్పుకొచ్చింది. ఎంత కష్టపడి పని చేసినా కొంతమంది కావాలనే తప్పులు వెతికేవారని వాపోయింది. కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు నేపోకిడ్‌ అని ఎగతాళి చేసేవారిని చెప్పింది. ఎప్పుడూ సూటి పోటి మాటలతో బాధపెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది. యాక్టింగ్‌ రానప్పుడు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్‌ అని చాలామంది ట్రోల్స్‌ చేసేవారని జాన్వీ గుర్తుకు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తన బలాలు, బలహీనతలు ఏంటి… ఎలా నటిస్తున్నా అనే విషయాలు తనకు తెలుసని.. కాబట్టే అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవట్లేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి…

శ్రీదేవి..ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్‌ బయోగ్రఫీ

ఫిబ్రవరి 13…ఓరి వారి సాంగ్‌ విడుదల

కోల్‌కతా సెట్ లో మెగా సాంగ్

- Advertisement -