- Advertisement -
నేపాల్ పార్లమెంట్ రద్దైంది. ఈ మేరకు మధ్యంతర ఎన్నికలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి. నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని …ప్రభుత్వ ఏర్పాటుకు షేక్ బహదూర్ దేవ్బా, కేపీ శర్మ ఓలి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు.
రాష్ట్రపతి పార్లమెంట్‌ను రద్దు చేశారని, సాధారణ ఎన్నికలు మొదటి దశ నవంబర్ 12న, రెండో దశ ఎన్నికలు 19న నిర్వహించాలని ఆదేశించినట్లు బిద్యాదేవి భండారి కార్యాలయం పేర్కొంది.
ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేపీ శర్మ ఓలీ బలనిరూపణకు వెనక్కి తగ్గగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఇతర రాజకీయ పార్టీలను కోరారు విద్యాదేవి. విపక్ష కూటమి ముందుకు వచ్చినా వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి.
- Advertisement -