- Advertisement -
దివంతగత అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై కార్తీక్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతుండగా సంజన ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. వహిస్తున్నారు. ఇందులో సంజన.. తేజు అనే పాత్రలో నటిస్తుండగా క్యూట్ స్మైల్‌తో సంజన లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారని సమాచారం.
ఇటీవలే సెబాస్టియన్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఏ మేరకు ఆకట్టుకుంటాడో వేచిచూడాలి.
- Advertisement -