గ్రీన్ ఛానల్…పోలీసుల సేవలు అభినందనీయం

91
police
- Advertisement -

రాచకొండ కమిషనరేట్ పోలీసులు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను.. ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్ నుంచి బేగంపేట కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.

వాస్తవానికి బేగంపేట, ఎల్బీ నగర్ మధ్య 17.6 కిలోమీటర్ల దూరం ఉండగా.. గ్రీన్ చానెల్ ద్వారా కేవలం 16 నిమిషాల్లో అవయవాలను చేర్చారు. వాస్తవానికి రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఎల్బీ నగర్ నుంచి బేగంపేట చేరుకోవడానికి గంటకుపైగా సమయం పడుతుంది.

రాచకొండ ట్రాఫిక్ పోలీసులు అందిస్తున్న సేవలను రెండు ఆసుపత్రి యాజమాన్యాలు అభినందించాయి. రాచకొండ సీపీ ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల సేవలను కొనియాడారు.

- Advertisement -