నాని ని భయపెడుతున్నారట..!

211
Nenu Local Movie Success
- Advertisement -

ఇటీవలే విడుదలైన ‘నేను లోకల్’ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ నాని క్రేజ్ ను మరింతగా పెంచేసింది.  ఇప్పుడు తన నెక్ట్స్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ కోసం అమెరికా వెళ్ళాడు నాని. అయితే ఈ సినిమా విజయం పట్ల అమెరికాలో వున్న నాని తాజాగా స్పందించాడు.  ఇప్పటికే కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్ మన్, మజ్ను,  ఇలా వరుసగా తన సినిమాలు హిట్‌  అవడంతో ఇప్పుడు ‘నేను లోకల్‌’  కూడా నానికి మరింత ఆనందాన్నిచ్చింది.
Nenu Local Movie Success
వరుసగా సినిమాలు హిట్‌ అవుతుంటే ఏ హీరోకైనా ఎలా ఉంటుంది? ఆ ఆనందంతో మరిన్ని ఎక్కువ సినిమాలకు కమిట్‌ అయ్యి చక చకా సినిమాలను కంప్లీట్‌ చేస్తారు. కానీ  నానీకి మాత్రం భయమేస్తోందట. మరి నాని ఎందుకు భయపడుతున్నాడో తెలుసా?…’నేను లోకల్‌’ విజయమే నానిని భయపెడుతోందట. ‘నేను లోకల్‌’ సినిమా ఆదరించబడుతున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని అన్నాడు.

అలా అంటూనే…’నేను లోకల్’ సినిమాకి ఈ స్థాయి విజయం లభిస్తుందని తాను అనుకోలేదని చెప్పాడు. ఈ సినిమాతో ప్రేక్షకులు తనని మరింత ఎత్తులో నిలపడం వలన తాను మరింత బాధ్యతగా మసలుకోవలసి ఉందని అన్నాడు. అంతేకాకుండా ప్రేక్షకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా భయం వేస్తుందని చెప్పాడు. అందువలన తాను మరింత జాగ్రత్తగా పనిచేయవలసిన అవసరం ఉందని అన్నాడు. ఈ సినిమాకి ఇంతటి సక్సెస్ ను అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.

అయితే నానీ అనుకుంటున్నదాన్ని బట్టి ఇదంతా చూస్తుంటే.. మంచి  సక్సెస్‌ లో రన్‌ అవుతున్న నానీని  ప్రేక్షకులు వారి అభిమానంతో జాగ్రత్తగా భయపెడుతున్నారనే అనుకోవాలి మరి.!

- Advertisement -